పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..!

Pawan Kalyan Deputy CM Of Andhrapradesh
జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహార వీరమల్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. దీంతో పీకే ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
వీరందరి బాధను తొలగించేలా ఓజీ మూవీ యూనిట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. OG కి సంబంధించిన చిత్రం టీజర్ ను వచ్చే ఏఫ్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అని సమాచారం.
త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన చేస్తారని కూడా ఫిల్మ్ నగర్ లో వార్తలు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హాష్మీ, ప్రియాంక మోహాన్ , అర్జున్ దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
