తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్లకు శుభవార్త..!

RMPs and PMPs should not use the word “doctor”.
తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట లభించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించకూడదని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే.
తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ అన్ని మల్టీఫ్లెక్సీ థియేటర్లకు పదహారు ఏండ్ల లోపు పిల్లలను సైతం అన్ని షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
గత జనవరి నెల 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. అయితే పదహారు ఏండ్ల లోపు పిల్లలను ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నది. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది.