ఆదాయ పన్నుపై కేంద్రం శుభవార్త..!
ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.
మధ్యతరగతి ఉద్యోగులకు ఇది బిగ్ రిలీఫ్ ఇచ్చేలా ఉంది. రూ. పన్నెండు లక్షల ఆదాయం ఉన్నవార్కి ఎనబై వేల రూపాయలు పన్ను రూపంలో ఆదా కానున్నది.