రేషన్ కార్డులపై శుభవార్త..!
ఈ నెల 26వ తారీఖు నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా రేషన్ కార్డులను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే.వీటితో పాటు రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం..
తాజాగా రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మరియు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుండి ఇవ్వనున్న రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోతే ఎవరూ ఆందోళన చెందనవసరంలేదు..
ఆయా గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో దరఖాస్తు చేస్కోవచ్చు.. కులగణన ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తాము.. పాత రేషన్ కార్డులను తొలగిస్తామని వస్తున్న వార్తలు సత్యదూరం. పాత రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు యాడ్ చేస్కోవచ్చు అని ఆయన సూచించారు..