సూక్ష్మతరహా (MSME) పరిశ్రమలకు కేంద్రం శుభవార్త..!
దేశంలోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ లకు ఇచ్చే రుణాలను ఐదు కోట్ల రూపాయల నుండి పది కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ” మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తాము. ఏడున్నర కోట్ల ఎంఎస్ఎంఈ వర్కర్లపై ప్రత్యేక్ దృష్టి పెడతాము .
దీనికింద అదనంగా లక్షన్నర కోట్ల నిధులు విడుదల చేస్తాము. స్టార్టప్ లకోసం ఇరవై కోట్ల రూపాయల వరకు రుణాలను పెంచుతాము. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇరవై కోట్ల రూపాయల వరకు రుణాలను అందజేస్తాము. మహిళలకు ప్రత్యేకంగా పది కోట్ల వరకు రుణాలు ఇస్తామని చెప్పారు.