భారీగా పెరిగిన బంగారం ధరలు..!
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ కూడా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 170 పెరిగి రూ.83,020కి చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.76,100గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై రూ.2వేలు పెరిగింది.
ప్రస్తుతం కేజీ రేట్ రూ.1,06,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.