జీహెచ్ఎంసీ మేయర్ మానవత్వం

GHMC Mayor Gadwala Vijayalakshmi has shown humanity.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ మానవత్వాన్ని చాటుకున్నారు.. నిత్యం సోషల్ మీడియాలో ఏదొక అంశంతో ట్రోల్ చేసే నెటిజన్స్ తాజా సంఘటనతో మేయర్ గ్రేట్ అంటూ పోస్టులు కామెంట్లు పెడుతున్నారు..
వివరాల్లోకి వెళ్తే నిన్న గురువారం సాయంత్రం మేయర్ గద్వాల విజయలక్ష్మీ కేబీఆర్ పార్కు దగ్గరకు వాకింగ్ కెళ్లారు.. అసమయంలో పార్కు దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడ్ని గమనించారు.. దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు..
ఆ క్రమంలో ఆ వృద్ధుడికి ఒక కాలు లేదు.. రెండు రోజులుగా ఏమి తినడంలేదు అని తెల్సింది.. దీంతో మేయర్ విజయలక్ష్మీ డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి బేగంపేట్ లోని షెల్టర్ హోమ్ కి పంపించారు.. ఈ సంఘటనపై అందరూ హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా నగరంలో కుక్కల బెడదా నుండి రక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు…
