జనవరి 2 న గేమ్ చేంజర్ ట్రైలర్
ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల రాక్షసి కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ట్రైలర్ విడుదల ముహుర్తం ఖరారు చేశారు. రేపు గురువారం జనవరి రెండో తారీఖున భాగ్యనగరంలో AMB మాల్‌లో మీడియా మిత్రుల గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకకు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. అయితే AMB మాల్‌లో విడుదల చేసే సమయానికే మూడు భాషల్లోనూ యూట్యూబ్ ఛానల్స్‌లో అధికారికంగా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.