గంభీర్ ఔట్.!.కొత్త కోచ్ అతనే..?
ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్ట్ ల సిరీస్ లో బాగంగా భారత్ – ఆస్టేలియా జట్లు తలపడుతున్నాయి.4టెస్ట్ లు ముగిసాయి.5 వ టెస్ట్ ఈ రోజు ప్రారంభమైంది.ఆడిన 4 టెస్ట్ లలో ఒకటి డ్రాగా ముగిసినా రెండు టెస్ట్ లలో ఆస్ట్రేలియా,ఒక టెస్ట్ లో భారత్ గెలిపొందాయి.ఆ గెలిచిన టెస్ట్ కు బూమ్రా సారద్యం వహించాడు.భారత స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ వరుసగా విఫలమవుతున్నారు.భారత పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.
ఈ విషయమై డ్రెస్సింగ్ రూమ్ లో సీనియర్లతో కోచ్ గౌతమ్ గంబీర్ దురుసుగా ప్రవర్తించినట్టి భయటకు లీక్ అయ్యింది. కోచ్ గౌతమ్ గంబీర్ పట్ల అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు..రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవి నుండి తప్పుకోవటం..గంబీర్ కోచ్ గా రావటం జరిగింది.సహజంగానే గంబీర్ కొంత అగ్రెసివ్ ఆటిట్యూడ్ గల వ్యక్తి..ఐపీఎల్ లో సైతం కోహ్లీతో విబేదాలు ఉన్న విషయం తెలిసిందే.వస్తూ వస్తూనే ఆయన సీనియర్లపై,టీమ్ తన చేతిలో ఉండాలని హుకుం జారీ చేసి కోచ్ గా వచ్చారు.దీంతో ఆటగాళ్ళు – కోచ్ మద్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి అదే జట్టు పేలవ ప్రదర్శనకు కారణమవుతుందని చర్చ ఉంది.వరల్డ్ కప్ విన్నింగ్ కేప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టడం వివాదంగా మారింది.
దీనిలో కోచ్ గంబీర్ హస్తం ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు.అయితే BGT 5 వ టెస్ట్ లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చని యెడల గంబీర్ ను కోచ్ స్థానం నుండి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమవుతుంది.గంబీర్ పై బీసీసీఐ సైతం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.అతని స్థానంలో మణికట్టు మాంత్రికుడు లెజెండరీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ ను కోచ్ గా తీసుకోనున్నట్టు తెలుస్తుంది.బలమైన జట్లపై అతను భారీ ఇన్నింగ్స్ లు ఆడటం,తెలివైన ఆటగాడిగా పేరుండటం,వివాదరహితుడుగా ఉండటం అతనికి కలిసొచ్చే అంశాలు.గౌతమ్ గంబీర్ భవితవ్యం BGT – 5వ టెస్ట్ ఫలితం వచ్చే వరకు వేచిచూడాల్సిందే.