ఢిల్లీకి చేరిన గచ్చిబౌలి భూపంచాయితీ..!

Kishan Reddy Gangapuram
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఎంపీలైన ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మాధవనేని రఘునందన్ రావు, డీకే అరుణ,నగేష్,కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని గచ్చిబౌలి భూముల వ్యవహారం లో జోక్యంచేసుకోవాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా పర్యావరణ,హెరిటేజ్ భూములను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.