దొరికిపోయిన తీన్మార్ మల్లన్న..?
రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు కాంగ్రేస్ ఎమ్మెల్సీ,తీన్మార్ మల్లన్న..గతంలో కేసీఆర్ టార్గెట్ గా Qన్యూస్ చానెల్ లో నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తి తీన్మార్ మల్లన్న.కాంగ్రేస్ ప్రభుత్వంలో గ్యాడ్యుయేడ్స్ ఎమ్మెల్సీగా విజయం సాదించారు.అయితే ఎన్నికైన కొన్ని రోజులకే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు.
బీసీ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలి అంటూ బీసీ కులాలతో బహిరంగ సభలు పెడుతున్నాడు.రెడ్డిలు టార్గెట్ గా ఘాటు వాఖ్యలు చేస్తూ వస్తున్నారు..ప్రభుత్వంతో తాను డీకొడుతున్నా అనే సంకేతం పంపేలా విమర్శలు గుప్పిస్తున్నారు..అయితే ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి.
బీసీ ప్రజానికం నుండి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేఖతను తప్పించుకునేందుకు తీన్మార్ మల్లన్నను రేవంత్ రెడ్డి రంగంలోకి దించినట్టు తెలుస్తుంది..ఉద్దేశ్యపూర్వకంగానే కాంగ్రేస్ స్క్రిప్ట్ లొ భాగంగా డైవర్షన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే రెడ్డిలపై తీన్మార్ మల్లన్న వాఖ్యలు చేస్తున్నారని చర్చ జరుగుతుంది..
వరంగల్ లో జరిగిన సమావేశానికి తీన్మార్ మల్లన్న హెలికాప్టర్ లో రావటం అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.పేదోడిని అని చెప్పుకునే తీన్మార్ మల్లన్నకు హెలికాప్టర్ ఎలా వచ్చింది..? రేవంత్ రెడ్డే ఇదంతా కావాలని చేపిస్తున్నాడని జనంలో తీవ్ర చర్చ జరుగుతుంది.హెలికాప్టర్ తీన్మార్ మల్లన్న ఎత్తుగడని దొరికిపోయేలా చేసిందని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది.