మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ మృతి…!

Former PM Manmohan Singh Died
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే.. దీంతో ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించారు.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు.
ఆయన 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు.. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హాయాంలో ఆయన ప్రధానిగా సేవలందించారు.. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ ఒకరుగా నిలిచారు..
1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలు అందించి దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్‌కు మంచి పేరు ఉందు.. 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టారు.. ఆ తర్వాత ఆయన ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
