రామోజీ రావు మృతి పట్ల మాజీ మంత్రి రోజా సంతాపం
మీడియా మొఘల్ ..ఈనాడు గ్రూప్స్ ,రామోజీ ఫిఒమ్ సిటీ అధినేత రామోజీ రావు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే.ఈ సంఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ప్రముఖ సినీ నిర్మాత, పాత్రికేయ మరియు టీవి రంగంలో విప్లవాత్మక మార్పును విశేష కృషిని అందించిన పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరనిలోటు.
వారి సంస్థ ఉషాకిరణ్ లో పని చేసిన నాటి రోజుల నుండి ప్రతి ఇంట నవ్వులు పూయించిన టీవిషో జబర్దస్త్ వరకు వారితో ఉన్న నా అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ వారి పవిత్ర ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని తెలిపారు.