నేడు పోలీస్ విచారణకు హాజరు కానున్న మాజీ మంత్రి జోగి రమేష్

Former minister Jogi Ramesh will appear in the police investigation today
2 total views , 1 views today
2021 సెప్టెంబర్ 17 తారీఖున ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై అప్పటి మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇప్పటి మాజీ మంత్రి జోగి రమేష్,వల్లభనేని వంశీలతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.
ముందస్తు బెయిల్ కోసం.. విచారణ నుండి మినహయింపు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పలువురు వైసీపీ నేతలకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది.
తాజాగా ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ “చంద్రబాబు నివాసంపై దాడి చేయాల్సినవసరం నాకు లేదు. నేను ఏమి తప్పు చేయలేదు.. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను.. ఎప్పటికైన ధర్మమే గెలుస్తుందని” మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.
