మాజీ ఎమెల్యే శంకర్ నాయక్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం.!

సింగిడిన్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నేత బానోత్ శంకర్ నాయక్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ నందు దాదాపు 500 మంది నిరుపేదలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ మానుకోట ప్రజలకు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శంకరన్న పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని తెలియజేశారు.

శంకర్ అన్న మానుకోట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, ప్రజల అభ్యున్నతి కోసం తన సంకల్పం ఇంకా జన హృదయాల్లో నిలిచి ఉంది కాబట్టే ప్రజలు ఇప్పటికీ తనను తను చేసిన మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని ఆయనను ఆశీర్వదిస్తున్నారని ఆయన తెలిపారు