ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం..?

ఏపీలో గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తొలి ప్రాధాన్యత ఓటులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు ముందుంజులో వున్నారు.
కూటమి పార్టీలు బలపర్చిన పాకలపాటి రఘువర్మపై స్వల్ప మెజారిటీతో దూసుకుపోతున్నారు. 19813 ఓట్లు గాను గాదె శ్రీనివాసులు నాయుడు (పీఆర్టీయూ) 6927, ఏపీటీఎఫ్, కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పాకలపాటి రఘు వర్మ 6596 ఓటు, యూటిఎఫ్ అభ్యర్థి కే. విజయ గౌరీ 5684 ఓట్లు వచ్చాయి.
ప్రధాన అభ్యర్థులు పాకలపాటి రఘువర్మ, గాదె శ్రీనివాసులు మధ్య 331 ఓట్ల వ్యత్యాసం, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం సిద్ధమైన తర్వాత తాజాగా వెలువడిన ఫలితాల్లో రెండో ప్రాధాన్యత ఓటుతో గాదె శ్రీనివాసులు గెలుపొందినట్లు తెలుస్తుంది..
