చంద్రబాబు పాత్రలో నటించిన నటుడిపై కేసు నమోదు
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీ s ఎన్టీఆర్ మూవీలో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన ప్రముఖ నటుడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్ పై హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. గతంలోనూ అతడిపై కేసు అదే పీఎస్ లో కేసు నమోదవ్వడం విశేషం .
పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అప్పట్లో వివాదం చెలరేగింది..