గుంటూరు మిర్చి యార్డులో రైతుల ధర్నా..!

ఏపీలోని గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి సరైన మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ధర్నా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్వింటా మిర్చికి ₹22,000 వరకు ధర దొరికేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం లో కేవలం ₹13,000 మాత్రమే లభిస్తోంది.
రైతులు ఎకరం ఖర్చు పెరిగిపోతున్నా, లాభాలు లేకుండా పోతున్నాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర పెంచాలని, కూలీల ఖర్చు, ఎరువులు, రవాణా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతే రాజు అంటున్న ప్రభుత్వాలు, రైతుల కష్టం గుర్తించి న్యాయమైన ధర కల్పించాలని రైతులు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
