మంత్రి తుమ్మలకు షాక్
రైతు భరోసా పథకం పై అభిప్రాయ సేకరణ పేరిట తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఈరోజు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి, చిన్నారెడ్డి లు ఈ రోజు మాట్లాడారు.
మొదటగా గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నుండి రైతులు మాట్లాడుతూ అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించారు . కనీసం 10 ఎకరాల వరకు ఇచ్చేలా నిబంధన పెట్టాలని.. చాలా మంది రైతులు, ఇంటి లోన్ కోసం, కారు లోన్ కోసం ఐటీ రిటర్న్స్ సమర్పిస్తారు కాబట్టి వారికి రైతు భరోసా ఇవ్వము అనడం సరికాదని వారు తుమ్మలతో చెప్పారు.
అన్ని జిల్లాల నుండి రైతులు దాదాపు ఇదే అభిప్రాయం చెప్పడంతో కంగుతినడం తుమ్మల వంతైంది.ఇంతే కాదు రూ. 500 బోనస్ సన్న వడ్లకే కాదు దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలని, కరెంట్ సరిగా రాక ఇబ్బందులు పడుతున్నామని.. రైతు బంధు పంటలు వేసే టైముకి ఇవ్వట్లేదని.. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని రైతులు చెప్తుంటే షాక్ తిన్న మంత్రి ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం వరకు సాగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ఇంక సరే ఉంటా అంటూ 2 గంటల్లోనే ముగించారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.