జనవరి 14 నుండి రైతు భరోసా..!
Telangana: డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలో సబ్ కమిటీ ఈరోజు గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో రైతుభరోసాపై సమావేశమైంది. ఈ సమావేశంలో రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది..
ఈ నిర్ణయాలను ఎల్లుండి శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. తాజా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు భరోసా పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చ జరిగినట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలి…. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే విధంగా చర్చలు జరిగాయి అని సమాచారం..ఈ పథకం జనవరి 14వ తేదీ నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.