యూరియా గురించి అసత్య ప్రచారం..!

 యూరియా గురించి అసత్య ప్రచారం..!

Loading

తెలంగాణలో యూరియా కోసం కొంత మంది కావాలనే రైతులతో క్యూలైన్లలో చెప్పులు, పాసు స్తకాలు పెట్టిస్తున్నారని వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని మంత్రి తుమ్మల చెప్పారు. అయితే, ప్రాథమిక సహకార సంఘాల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు ఎందుకు గుమిగూడుతున్నారో, గంటలపాటు ఎందుకు వేచి చూస్తు న్నారో కారణం మాత్రం మంత్రి చెప్పలేదు.

మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ‘మంత్రి చెప్పినట్టుగా ఒకవేళ యూరియా అందు బాటులో ఉంటే.. పంపిణీ ఎందుకు ఆలస్యమవతున్నది? అధికారులు విఫలమవుతున్నారా?’ అనే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ‘మళ్లీ యూరియా గోస’ శీర్షిక సోమ వారం ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల యూరియా పంపిణీపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ కథ నాన్ని పరోక్షంగా పేర్కొంటూ… రైతులతో కావాలనే క్యూలై న్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని వ్యాఖ్యా నించారు. తద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయించ డంతోపాటు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రస్తుతం 1.4 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. మరో 80 వేల టన్నులు కోసం కేంద్రానికి ప్రతి పాదనలు పంపినట్టు ఆయన వెల్లడించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *