వైసీపీ మాజీ ఎమ్మెల్యే తనయుడు అరెస్ట్

 వైసీపీ మాజీ ఎమ్మెల్యే తనయుడు అరెస్ట్

3 total views , 1 views today

ఏపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయడైన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం బెంగుళూరు విమానశ్రాయంలో పోలీసులు అరెస్ట్ చేశారు..

తిరుపతి డీఎస్పీ రవి మనోహర చారి నేత్రుత్వంలోని బృందం మోహిత్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన సంగతి తెల్సిందే . ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినాక తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో ఈవీఎం లను భద్రపరిచారు ..

ఆ స్ట్రాంగ్ రూంలను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులిపర్తి నానీపై నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అయన తనయుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి లతో పాటు వారి అనుచరులు హత్యప్రయత్నానికి దిగారు.. ఈ దాడిలో నానితో పాటు గన్ మెన్స్, డ్రైవర్లపై దాడులకు దిగారు.. గన్ మెన్ తేరుకొని కాల్పులు జరపడంతో నిందితులు అంతా పారిపోయారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400