తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం
ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ను త్వరలోనే తప్పించనున్నారా..? . సీపీ రాధాకృష్ణన్ స్థానంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించనున్నారా అంటే ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి నిజమే అన్పిస్తుంది.
ప్రస్తుత గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలే కాకుండా మరోవైపు పుదుచ్చేరి లెప్టినెంట్ బాధ్యతలను చూస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే..ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడమే కాకుండా ఓటు బ్యాంకును కూడా సాధించింది.దీంతో తెలంగాణ ప్రాంతం..నాయకులపై సరైన అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే భవిష్యత్తులో పార్టీకి బలం చేకూరుతుందనే భావనలో మోదీ షా ఉన్నట్లు సమాచారం..