తాప్సీ చేసిన పనికి అందరూ ఫిదా..!

తాప్సీ అందమే కాదు మనసు కూడా అందమే నిరూపించారు.హేమ కుంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ తాప్సీ తన భర్త మథియాస్ భో తో కల్సి ముంబైలోని ఓ మురికివాడలో నిరుపేదలకు కూలర్లు.. ఫ్యాన్లు పంపిణీ చేసి గొప్ప మనసును చాటుకున్నారు.
వేసవి కాలంలో ప్రస్తుతం ఉన్న నలబై డిగ్రీల ఎండను దృష్టిలో పెట్టుకుని ఈ ముద్దుగుమ్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కొంచెం ఉక్కపోతగా ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది నలబై డిగ్రీల వేడిమిని తట్టుకోవాలంటే మనవల్ల అవుతుందా..?.
కూలర్లు… ఫ్యాన్లు నిత్యావసర వస్తువులైన కానీ వీటిని కొనే స్థోమత పేదలకు ఉండదు. అలాంటివాళ్లకు అండగా ఉండాలనే నేను ఈనిర్ణయం తీసుకున్నాను ముద్దుగుమ్మ తాప్సీ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు అమ్మడుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
