సినిమా వాళ్లంటే అంత అలుసా…?-ఎడిటోరియల్ కాలమ్
సినిమా ఇదో రంగులతో కూడిన ఓ కలల ప్రపంచం.. బయటకు కన్పించేంత అందంగా ఉండవని నానుడి.. చిత్రం నిర్మాత దర్శకుడు హీరో హీరోయిన్ స్టార్స్ తప్పా మిగతా నటుల జీవితాలు ఎలా ఉంటాయో ఒకప్పటి కృష్ణానగర్.. ఇప్పటి చిత్రపురి కాలనీ వెళ్తే ఆర్ధమవుతుందని ఇటు సినీ క్రిటిక్స్ అటు మేధావి వర్గం అంటుంటారు. అయితే తాజాగా సాక్షాత్తు మంత్రి.. అది కూడా ఓ మహిళ నాయకురాలైన కొండా సురేఖ వ్యాఖ్యలతో మరోకసారి సినిమా వాళ్లంటే.. వాళ్ల జీవితాలంటే అంత అలుసుగా కన్పిస్తున్నాయా అని విమర్శలు విన్పిస్తున్నాయి..
మంత్రిగా.. ఓ బాధ్యతయుతమైన స్థానంలో ఉండి కూడా సాటి మహిళ గురించి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువడుతున్నాయి. అక్కినేని కుటుంబం అంటే వివాదాలకు.. ఎలాంటీ గొడవలకు కేంద్ర బిందువుగా ఉండవని ఇరు రాష్ట్రాల ప్రజలకే కాదు సినీ ప్రేక్షకులకు ఎరిగిన సత్యం. అలాంటి కుటుంబం గురించి మంత్రి అలా మాట్లాడటం చాలా బాధాకరం.. గుస్సాకరం.. సినిమా వాళ్లంటే అలాగే ఉంటారా.. ఆస్తుల కోసం.. ఇంకా దేనికోసమో ఇలా చేస్తారా..?. అసలు నోటికి ఎంత మాట వస్తే అంత అనడం కరెక్టేనా అని ఫిల్మ్ నగర్ తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర అసహానం వ్యక్తమవుతుంది.
సినిమావాళ్ళు రాజకీయాలు చేయగలరు.. మరి రాజకీయ నేతలు సినిమాలు చేయగలరా.. అలా నటించగలరా..? .. రెండూన్నర గంటల మూవీ రావడం కోసం 24FRAMES సెట్ చేస్తేనే.. కష్టపడితేనే అది స్క్రీన్ పైకి వస్తుంది. ఊహా తెల్సిన వాళ్ళ దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్ని మెప్పిస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్ నుండి హీరో వరకు.. ఆఫీస్ బాయ్ నుండి దర్శకుడు వరకు అందరూ రేయింభవళ్లు కష్టపడితేనే రాదు ఔట్ పుట్. వందల కోట్లు దారపోసిన.. రేయ్యింభవళ్లు కష్టపడిన కానీ ఒక్కొక్కసారి ఫలితం ఉండదు. ఆ సినిమా హిట్టైతే అందరూ హ్యాపీ.. లేకపోతే కొంతమంది మాత్రం ఫిల్మ్ నగర్ రోడ్లపై అవకాశాల కోసం తిరగడమే హీరోయిన్ దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ వరకు.
ఏ రంగమైన ఇలాంటి ఆరోపణలు చేయడం సహాజం. కానీ తమకు ఏ మాత్రం సంబంధం లేని ఓ కుటుంబాన్ని.. ఓ హీరోయిన్ ను లాగడంపైనే సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా పరువుకు భంగం కల్గించిన సదరు మంత్రి పై నాంపల్లికోర్టును ఆశ్రయించిన నాగార్జున గారు శిక్షపడేవరకు పోరాడాలి.. న్యాయ పోరాటంలో మేమంతా అండగా ఉంటామని సోషల్ మీడియా.. సినీ ఇండస్ట్రీ ముక్తకంఠంతో కదిలింది. ఇప్పటికైన నాగార్జున గారు పట్టువదలకుండా న్యాయపొరాటం చేసి సదరు మంత్రిపై చర్యలు తీసుకునేలా చేసి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా కోట్లాడాలని ఆర్జీవీ లాంటి దర్శకుడే చెప్పాడంటేనే ఈ సమస్య ఎంత జఠిలమైందో ఆర్ధమవుతుంది.ఏది ఏమైన ఇప్పటి నుండి సినీమా వాళ్ల గురించే కాదు ఎవరి గురించైన ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని అందరూ గుర్తించాలి.