సరికొత్త రోల్ లో ద్రావిడ్
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతల నుండి తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ ఇంకా వాస్తవానికి జట్టు కోచ్‌గా కంటిన్యూ కావాలని ద్రావిడ్‌ను బీసీసీఐ కోరింది. అందుకు ఆయన నిరాకరించారు.
దీనివెనక ఉన్న అసలు కారణం ఏంటంటే..? టీమిండియా జట్టుకు కోచ్‌గా 10 నెలలు విదేశాల్లో గడిపాలి.. ఈ కారణంతో కుటుంబానికి ద్రావిడ్ మొత్తానికి దూరంగా ఉండాలి. ఆ కారణంతో కొనసాగేందుకు అంగీకరించలేదు.
ఐపీఎల్ అయితే 2, 3 నెలల సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఆ కోణంలో ఐపీఎల్ కోసం పనిచేసే అవకాశం ఉంది. కుటుంబంతో గడిపే వెసులుబాటు కలుగుతుంది. గతంలో ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా, కోచ్‌గా పనిచేసిన అనుభవం ద్రావిడ్‌కు ఉంది. ఐపీఎల్ ఢిల్లీ జట్టు కోచ్ నుంచి ఇండియా జూనియర్ జట్టుకు కోచ్‌గా ద్రావిడ్ వెళ్లారు. అండర్-19 జట్టు నుంచి మెలికల్లాంటి కుర్రాళ్లను తీసుకొచ్చారు. తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశారు. తర్వాత తిరిగి ఐపీఎల్ మెంటార్ లేదంటే హెడ్ కోచ్‌గా వెళ్లే అవకాశం ఉంది అని క్రీడాపండితుల టాక్.