డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్ లకు షాకింగ్ కలెక్షన్లు

Double Ismart VS Mr. Bachchan 1st Day Collections
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ నిర్మాతగా వ్యవహరించగా ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించగా నిన్న ఆగస్టు పదిహేను తారీఖున విడుదలైన మూవీ డబుల్ ఇస్మార్ట్..
మరో దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా విడుదలైన మరో మూవీ మిస్టర్ బచ్చన్. ఈ రెండు సినిమాలకు మొదటి రోజు కలెక్షన్లు అంతంతమాత్రన వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
దేశ వ్యాప్తంగా ఇస్మార్ట్ కు రూ.6.3కోట్లు, మిస్టర్ బచ్చన్ కు రూ.4.5కోట్లు వసూలు అయ్యాయని తెలిపింది. అయితే మరోవైపు సోమవారం వరకు వరుస సెలవులు కావడంతో కలెక్షన్లు పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
