డబుల్ ఇస్మార్ట్ శంకర్ హిట్టా..? ఫట్టా..?-రివ్యూ
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ట్రెండ్ సెట్టర్. హీరోయిజం డైనమిక్స్ ని మార్చిన డైరెక్టర్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మేకర్. రామ్ పోతినేని ఎనర్జిటిక్ హీరో. మాస్, క్లాస్ రెండూ పాత్రల్లో ఒదిగిపోయే యాక్టర్. ఈ ఇద్దరూ కలసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాంచి హిట్. రామ్ ని ఉస్తాద్ చేసింది ఈ సినిమానే. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వచ్చింది. మరీ సీక్వెల్ డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిందా? ఫ్యాన్స్ అంచనాలని అందుకుందా ?
కథ గురించి : బిగ్ బుల్ (సంజయ్ దత్) పెద్ద డాన్. ప్రపంచాన్ని ఏలుతున్న ఆయన బ్రెయిన్ ట్యూమర్ బారిన పడతాడు. మూడు నెలల కంటే ఎక్కువ బ్రతకడని తేలుతుంది. తన వ్యాధిని నయం చేసుకోవడానికి అన్ని మార్గాలు అన్వేసిస్తున్న బిగ్ బుల్ కి సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) కలుస్తాడు. మెమరీ ట్రాన్స్‌ఫర్ చేస్తే జీవించే అవకాశం వుందని చెప్తాడు. అయితే ఈ ప్రయోగం వికటిస్తుంటుంది. ఈ ప్రయోగంతో సక్సెస్ అయిన ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) గురించి తెలుసుకొని అతన్ని పట్టుకోస్తారు. తర్వాత ఏం జరిగింది ? ఇస్మార్ట్ శంకర్ మీద ఈ ప్రయోగం ఫలించిందా ? మెమరీ ట్రాన్స్‌ఫర్ జరిగిందా ? బిగ్ బుల్ అమరత్వం పోందాడా? ఇస్మార్ట్ శంకర్… బిగ్ బుల్ గా మారాడా? ఇవన్నీ తెరపై చూడాలి.
కథా విశ్లేషణ: ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ కి నచ్చిన సినిమా. ఒక సైన్స్ ఫిక్షన్ కథలో మాస్ క్యారెక్టరైకేషన్ ని చొప్పించడం ఆడియన్స్ బాగా నచ్చింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ క్యారెక్టర్ కూడా అంతే కంటే మాస్ మ్యాడ్ నెస్ డిజైన్ చేశారు పూరి. ఇస్మార్ట్ శంకర్ ఫ్లాష్ బ్యాక్ తో కథ మొదలౌతుంది. హీరో ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్.. తర్వాత వచ్చే యాక్షన్ పై ఆసక్తిని పెంచుతుంది. రామ్, కావ్య థాపర్‌ల లవ్ ట్రాక్ ఇస్మార్ట్ లవ్ ట్రాక్ ని గుర్తుకు తెస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ ఇంకాస్త వేగం అందుకుంటుంది. ఇస్మార్ట్, బిగ్ బుల్ టార్గెట్స్ ని రివిల్ చేసిన విధానం ఇంట్రస్టింగ్ గా వుంటుంది. చాలా చోట్ల ఇస్మార్ట్ మ్యాజిక్ ని రిపీట్ చేయగలిగారు పూరి. హైవీ క్లైమాక్స్ యాక్షన్ ని ఇష్టపడే ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ ఫ్రాంచైజ్ ని కొనసాగిస్తూ చివర్లో పార్ట్ 3కి కూడా లీడ్ ఇచ్చారు.
నటీనటుల నటన: రామ్ మరోసారి తన ఎనర్జీనంతా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. యాక్షన్ సీన్స్, డ్యాన్సుల్లో అదరగొట్టారు. మొత్తం కథని తన భూజాలపై లాకొచ్చారు. సంజయ్ దత్ సినిమాకి ఓ స్టార్ ఎట్రాక్షన్. ఆయన ప్రజెన్స్ బావుంది. ఈ ఇద్దరి వచ్చే సీన్స్ అలరిస్తాయి. కావ్య థాపర్ గ్లామరస్ గా కనిపించింది. నటన ఓకే. టెంపర్ వంశీ, గెటప్ శ్రీను పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. అలీ ట్రాక్ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. మిగతా పాత్రలు పరిధిమేర వుంటాయి.
టెక్నికల్ గా : మణిశర్మ పాటలు క్యాచిగా వున్నాయి. స్టెప్పా మార్, మార్ ముంత పాటలు మాస్ ని అలరిస్తాయి. నేపధ్య సంగీతం కూడా హెవీగా చేశారు. కెమరాపనితనం రిచ్ గా వుంది. ముంబైలో తీసిన సన్నివేషాలు ఆకట్టుకునేలా వచ్చాయి. మాస్ సినిమాకి తగ్గట్టే సినిమాటోగ్రఫీ సాగింది. నిర్మాణంలో రాజీపడలేదు. పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. పూరి మార్క్ డైలాగులు కొన్ని అలరిస్తాయి. ఒక మాస్ ట్రీట్ లానే సినిమాని ప్రజెంట్ చేశారు పూరి. ఈ వీకెండ్ లో మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడాలనుకునే ప్రేక్షకులు డబుల్ ఇస్మార్ట్ మంచి ఛాయిసే.
ప్లస్ పాయింట్స్
రామ్ పోతినేని ఎనర్జీ
పాటలు, యాక్షన్ సీన్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
ఊహకు అందే కథ, కథనం
రొటీన్ ట్రీట్మెంట్
అలీ ట్రాక్
రేటింగ్ 2.75/5
CC : NT