వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా..?
మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత విలన్ గా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హాటెస్ట్ భామ .. ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవల ఈ భామ నికోలయ్ సచ్ దేవ్ ను ముంబైలోని ఓ ప్రముఖ గ్రాండ్ హోటల్ లో జరిగిన వివాహా వేడుకల్లో పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే.
వీరిద్దరి వివాహానికి సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై వీరిద్దర్ని దీవించారు. తాజాగా భర్త నికోలయ్ సచ్ దేవ్ మాట్లాడుతూ ” వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లవ్ నేను కాదు.. ఆమె ఫస్ట్ లవ్ సినిమా.. రెండో లవ్ నేను..
పెళ్లైనాక కూడా ఆమె సినిమాల్లో నటిస్తుంది. పెళ్లి తర్వాత పేరు మార్చుకుంటా అని నాతో చెప్పింది. నేనే వద్దు .. ఇప్పుడు ఎలాగా ఉందో అలానే ఉండనివ్వు అని చెప్పాను. తను ఇప్పుడు ఉన్న వరలక్ష్మీ శరత్ కుమార్ లాగే సినిమాల్లో కొనసాగుతుందని ” అన్నారు.