తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునే దమ్ము లేదా..!
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇటీవల హన్మకొండలో జరిగిన బీసీ మహసభలో మాట్లాడుతూ ఓ సామాజికవర్గంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఆ వ్యాఖ్యలపై ఇంట బయట నుండి ఆ సామాజికవర్గం నుండి విమర్శలు వెలువడుతున్నాయి. గతంలో దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అవమానించేలా మాట్లాడారని షోకాజ్ నోటీసులివ్వడమే కాకుండా క్షమాపణలు చెప్పించే స్థాయికి తీసుకెళ్లారు.
పార్టీ నియామవళిని దాటారని జడ్షన్ లాంటి నేతను సైతం బహిష్కరించారు. అలాంటిది మొత్తం సామాజిక వర్గాన్నే అవమానించేలా కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ఆధిష్టానం భయపడుతుందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుల్లో ఒకరూ తీన్మార్ మల్లన్న అని అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే స్వయంగా ప్రకటించిన దాఖాలాలు ఉన్నాయి.
మల్లన్న ఎమ్మెల్సీగా గెలవడానికి కింద స్థాయి నుండి పైస్థాయి వరకు పనిచేశారు..ఈ మాటలు తాజాగా ఎమ్మెల్యే నాయిని దగ్గర నుండి మంత్రి సీతక్క వరకూ అందరూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అలాంటి మల్లన్నను సస్పెండ్ చేసిన ఎలాంటి చర్యలు తీసుకున్న పార్టీకి నష్టం చేకూరుతుంది. అందుకే షోకాజ్ నోటీసులతో సరిపెట్టాలని ఆ పార్టీ నాయకత్వం చూస్తుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ కు ఆ దమ్ము లేదు అని కూడా సెటైర్లు వేస్తున్నారు..!