మీరు పెరుగు తింటున్నారా..?
సహాజంగా అది బిర్యానీ అయిన అన్నం అయిన చివర్లో పెరుగుతో తింటే వచ్చే కిక్కే వేరేబ్బా. అయితే పగలు పెరుగు తింటే అనేక లాభాలుంటాయి. కానీ రాత్రి పూట పెరుగు తింటే మాత్రం అనేక నష్టాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
రాత్రిపూట పెరుగు తింటే దాని తీపి లక్షణాల కారణంగా తిన్నవారి శరీరంలో పిత్తం,కఫం పెరుగుతాయి. ఆరోగ్య వంతులు రాత్రిపూట తింటే కొంతవరకు పర్వాలేదు. కానీ జలుబు,దగ్గు, ఆలర్జీతో బాధపడేవాళ్లు రాత్రి పూట తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం , మధ్యాహ్నాం పెరుగు తింటే సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో ఉండే కాల్షియం ,ప్రోటీన్ల వల్ల శరీర కండరాలు బలంగా మారతాయి.. తద్వారా ఆరోగ్యంగా ఉండోచ్చు. ఇంకా ఏమి మరి ఈ రోజు నుండే ఉదయం, మధ్యాహ్నాం పెరుగు తినడం అలవాటు చేసుకోండి. అలవాటు ఉన్నవాళ్లు మితంగా తినండి ఆలస్యం ఎందుకు ఇక..!