కొండా సురేఖను వదిలేది లేదు- హీరో అఖిల్

Akhil Akkineni actor
తమ కుటుంబం గురించి నిరాధార.. అసత్య ఆరోపణలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అక్కినేని వారసుడు.. యువహీరో అఖిల్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
ఎక్స్ లో ” మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం.. హాస్యాస్పదం.. అసభ్యకరం.. జుగుప్సాకరం.. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరిచిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆమె అలా వ్యాఖ్యానించారు.
ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు.. క్షమించరానిది.. అమాయకులపై సిగ్గులేకుండా దాడి చేసి అమాయకుల ను రాజకీయాలకు సంబంధం లేనివాళ్లను లాగి బలిపశ్వులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండలేను. ఈసమాజంలో ఇలాంటి వ్యక్తులకు చోటు లేదని అఖిల్ ట్వీట్ చేశాడు.
