డిప్యూటీ గారు ఏంటి ఇది..!

Deputy, what is this..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ కమీషనర్ చేస్తున్న అరాచకంపై మెట్టుగూడ డివిజన్ బీఆర్ఎస్ కార్పోరేటర్ రసూరి సునీత ప్రశ్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అసలు విషయానికి వస్తే నగరంలోని మెట్టుగూడ డివిజన్ పరిధిలో పేదల షాపులపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. . మెట్టుగూడ మార్కెట్ లో పేదల షాపుల స్థలాలను దౌర్జన్యంగా డిప్యూటీ కమిషనర్ ఖాళీ చేయిస్తున్న విషయం తెలుసుకున్న కార్పోరేటర్ రసూరి సునీత అక్కడకి చేరుకున్నారు.
కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి అండతో పేదల పొట్టపై డిప్యూటీ కమిషనర్ కొడుతున్నరంటూ ఫైర్ అయ్యారు. స్థానికి కాంగ్రెస్ నాయకుల కోసమే పేదల మార్కెట్ స్థలాలను కాంగ్రెస్ మేయర్ గద్వాల విజయలక్ష్మి దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు.
