భద్రాద్రి కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్బయిన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
పామాయిల్ పరిశ్రమలో రూ.36 కోట్లతో ఆధునిక టర్బైన్‌ను ఏర్పాటు చేశారు. గానుగ ఆడించిన పామాయిల్ ఖాళీ గెలల ద్వారా 2.50 మె.వా. విద్యుత్ ఉత్పత్తి కానున్నది.నిరంతరాయంగా పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.
పూర్తిగా కంప్యూటర్లు, ఆటోమేటిక్ యంత్రాలతో ఆధునిక టర్బయిన్ ఏర్పాటు చేశారు. ఏడాదికి రూ. కోట్ల విద్యుత్ ఛార్జీ ఆదా అవుతుందందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారు.