ముదిగొండ మండలంలో డిప్యూటీ సీఎం భట్టీ..!

Deputy CM Bhatti in Mudigonda Mandal..!
ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు జిల్లాలోని ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో మండల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ ఎంపీపీ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మట్ట జనార్దన్ రెడ్డి-రమాదేవి దంపతుల కుమారుడు గోపీనాథ్ రెడ్డి-చందన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

డిప్యూటీ సీఎం వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.
