BRS కి డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ “ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు..
ఐదేళ్లుగా రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామన్నారు.
దేశంలో ఒకేసారి రూ.2లక్షల రుణం మాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు. దీనిపై చాలామంది అవగాహన లేకుండా విమర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.