ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేపు ఆదివారం మధ్యాహ్నాం ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి.. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,యువనేత రాహుల్ గాంధీ,సోనియా గాంధీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు.
త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ .. రాష్ట్రంలో అన్ని స్థాయి కమిటీలు ఏర్పాటు.. నామినేటేడ్ పదవులు ఇలా పలు అంశాలపై ఖర్గే,సోనియా గాంధీ,రాహుల్ గాంధీలతో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడం.. నామినేటేడ్ పదవులు, పార్టీ కమిటీలు ఏర్పాటు పై ఆ పార్టీ శ్రేణులే గుర్రుగా ఉండటంతో రేపటీ పర్యటనతోనైన క్లారిటీ వచ్చేవీలుంటుందని గాంధీభవన్ లో టాక్.
ఈ నెలలో కొత్త రుణాలు, ప్రాజెక్టుల మంజూరుపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమవుతారు..రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి.. పెండింగ్ నిధులను,విభజన హామీలను నెరవేర్చాలి.. తెలంగాణాలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరనున్నట్లు సీఎంఓ వర్గాలు పేర్కోన్నాయి.