డేవిడ్ వార్నర్ కీలక నిర్ణయం

david warner
టెస్టుల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సేవలు అవసరమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
సాధన కోసం షెఫీల్డ్ షీల్డ్ ఆడతానని వార్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాకు స్మిత్ ఓపెనింగ్ చేస్తున్నాడు..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కి ఓపెనర్ స్థానం నుంచి స్మిత్ తప్పుకొన్నారు. ఓపెనింగ్ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో వార్నర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం .
