దానం.. ఆగమాగం..!
![దానం.. ఆగమాగం..!](https://www.singidi.com/wp-content/uploads/2025/02/danam-nagender-850x560.jpg)
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండీ బీఆర్ఎస్ తరపున గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా పార్టీ ఫిరాయింపుల విషయంపై బీఆర్ఎస్ పార్టీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేసు వేసింది.
దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నొయ్యి.. వెనక చూస్తే గొయ్యి అన్నట్లు మారింది. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అధికార కార్యక్రమాలకు ఆయా చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు కాలేని పరిస్థితి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అయితే మాత్రం దానం నాగేందర్ పరిస్థితి ఆగమాగంగా ఉంది.
సొంత నియోజకవర్గంలో జరుగుతున్న భూమి పూజ కార్యక్రమాలకు సైతం హాజరు కాలేని పరిస్థితికి దిగజారిపోయారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన అనుచరులే ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. కేసు కోర్టులో ఉండటం.. తప్పకుండా అనర్హత వేటు పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో సైతం వీళ్లు ఎవరూ పాల్గోనలేదు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)