సైమా 2024 అవార్డుల్లో దసరా కు పంట

 సైమా 2024 అవార్డుల్లో దసరా కు పంట

SIIMA Awards

Loading

సినీ పరిశ్రమలో మోస్ట్ పాపులర్‌ అవార్డు సెర్మనీల్లో ఒకటైన సైమా 2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం దుబాయ్‌లో సెప్టెంబర్‌ 14, 15వ తేదీల్లో జరుగుతుంది. 2023కిగాను ప్రకటించిన ఈ అవార్డ్సుల్లో తెలుగు చిత్రాలు తమ సత్తా ఏంటో మరోసారి చాటాయి.

నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు పలు విభాగాల్లో పురస్కారాలు అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి.దసరా సినిమా ఏకంగా నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాని అవార్డు అందుకోన్నారు..

ఇక కీర్తిసురేశ్‌ ఉత్తమ నటిగా.. ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్‌.. ఉత్తమ సహాయ నటుడిగా దీక్షిత్‌ శెట్టి (కన్నడ యాక్టర్‌) అవార్డులు అందుకున్నారు.

అవార్డ్‌ విన్నర్ల జాబితా ఇదే..

ఉత్తమ చిత్రం : భగవంత్ కేసరి
ఉత్తమ సహాయ నటి : బేబి కియారా (హాయ్‌ నాన్న)
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ) : శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)
ఉత్తమ నిర్మాత : వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (హాయ్‌ నాన్న)
ఉత్తమ నటి (డెబ్యూ): వైష్ణవి చైతన్య (బేబి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) : ఆనంద్ దేవరకొండ (బేబి)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) : మృణాళ్‌ ఠాకూర్‌
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌) : సాయి రాజేశ్‌ (బేబి)
ఉత్తమ హాస్య నటుడు : విష్ణు (మ్యాడ్‌)
ఉత్తమ నటుడు (డెబ్యూ) : సంగీత్ శోభన్ (మ్యాడ్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు : అబ్దుల్‌ వహబ్‌ (హాయ్‌ నాన్న, ఖుషి)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌ : రామ్ మిర్యాల (బలగం)

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *