చిన్న సినిమాగా వచ్చి రికార్డుల మోత..!

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన తాజా మూవీ ‘కోర్టు’ .. చిన్న మూవీగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది.
ప్రేక్షకులు బ్లాక్బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.
మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.శివాజీ, , హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా .. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ గా దినేష్ పురుషోత్తమన్ వ్యవహారించారు.
