స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి- నందిని విక్రమార్క

 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి- నందిని విక్రమార్క

Nandini Vikramarka

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో మంగళవారం ఈరోజు సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిని విక్రమార్క మాట్లాడుతూ ” రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మండల పరిధిలోని జెడ్పిటిసి, ఎంపీటీసీ లతో పాటుగా అన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులని గెలిపించుకునే దిశగా స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

” మన లక్ష్యం సాధించుకోవడం కోసం రానున్న రోజులలో ప్రతి ఎంపీటీసీ పరిధిలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని నందిని విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *