కాంగ్రెస్ లో “మంత్రివర్గ విస్తరణ భయం”.!

Telangana: తెలంగాణ లో కాంగ్రేస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి అయ్యింది.ప్రభుత్వం ఏర్పాటైనాక ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం తనతో కలుపుకుని 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి వారికి వివిద శాఖలను కేటాయించారు.మరో 6 మంత్రి పదవులను అదిష్టానం పెండింగ్ లో పెట్టింది.అయితే ఏడాది పూర్తైనా ఇంత వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగకపోవటంతో అటు ఆశావాహుల్లో,ఇటు ప్రజల్లో కాస్తంత నైర్శ్యం కనబడుతుంది.
కీలకమైన విద్యాశాఖ,హోంశాఖ తో పాటు పలు శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉండటంతో అన్నీ నిర్వహించలేక , సరైన పర్యవేక్షణ లేక రాష్ట్రంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు జరుగుతున్నాయి..మంత్రి వర్గం మొదటనే విస్థరిస్తే ఇప్పటికి ఈ సమస్య ఉండేది కాదు..నెలకు ఒకసారి మంత్రి వర్గ విస్తరణ అంటూ వార్తలు రావటం,ముఖ్యమంత్రి డిల్లీకి వెల్లడం చర్చలు కుదరకు తిరిగిరావటం జరుగుతూ వస్తుంది కాని మంత్రివర్గ విస్థరణకు మాత్రం ముందడుగు పడటం లేదు.
మరి మంత్రి వర్గ విస్థరణకు ఉన్న అడ్డంకులేంటి..? విస్తరణకు హస్తంపార్టీ ఎందుకు ఫయపడుతుంది..? సహజంగా కాంగ్రేస్ పార్టీ అంటేనే పెద్ద పెద్ద తలకాయల పార్టీ ఏకచత్రాదిపత్యం ఆ పార్టీలో నడవదు.ఎవరివారే లీడర్లు,వర్గాలుగా ఉంటారు.ఏడాది పాటు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేసింది మంత్రివర్గం.మంత్రివర్గ కూర్పు విషయంలో ఆదిపత్య దోరణితో కొందరు నేతలు వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి కొందరి పేర్లు సూచిస్తుండటం,తమ వాళ్ళకు ఇవ్వాలంటూ పలువురు సీనియర్ నేతలు పట్టుబడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం.కరవమంటే కప్పకుకోపం,విడవమంటే పాముకు కోపం అన్నట్టు.ఎవరిని కాదన్నా పార్టీ నష్టపోయే అవకాశం ఉండటంతో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రేస్ మెతకవైఖరి అవలంబిస్తున్నట్టు తెలుస్తుంది.ఏడాది గడిచినా మంత్రివర్గ విస్తరణ ఏదంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేయటం,మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందన్న ఆశలతో ఉన్న ఆశావహులు సైతం అసహనం వ్యక్తం చేయటంతో మరి ఇప్పుడైనా డిల్లీ పెద్దలు మంత్రివర్గ విస్థరణకు ముహూర్తం ఫిక్స్ చేస్తారా వేచి చూడాలి.
