కాంగ్రెస్ నేతలపై మంత్రికి పిర్యాదు
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంపై కథనం ఇచ్చిన ఓ జర్నలిస్టును, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు బెదిరించి ఇతరులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే యత్నం చేస్తున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశారనే కారణంగా మరో ఇద్దరు విలేకరులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని.. తమపైన దాడులు ఆపాలని మంత్రి సీతక్కకు జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు..