సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డు..!
![సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డు..!](https://www.singidi.com/wp-content/uploads/2025/01/Sankranthi-ki-Vasthunnam-850x560.jpg)
విక్టరీ వెంకటేశ్ హీరోగా.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ .సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా భీమ్స్ మ్యూజిక్ అందించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. కాగా, త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)