రిటైర్మెంట్ పై ధోనీ కీలక వ్యాఖ్యలు..!

clarity on MS Dhoni Retirement
4 total views , 1 views today
ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ సీనియర్ ఆటగాడు.. మాజీ సారధి మహేందర్ సింగ్ ధోనీ ఐపీఎల్ నుండే కాకుండా క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోనున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇటీవల చెన్నై హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచే అఖరి మ్యాచ్.
అందుకే తనయుడి ఆఖరి మ్యాచ్ చూద్దామని ధోనీ తల్లిదండ్రులు సైతం వచ్చారు అని కూడా వార్తలు విన్పించాయి. తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ షమానీతో జరిగిన పాడ్ కాస్ట్ లో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ ఈ జూలై నెలతో నాకు నలబై నాలుగు ఏండ్లు వస్తాయి. ఇంకా నేను ఆట ఆడుతున్నాను.
పది నెలల టైం ఉంది ఇంకా నాకు. తదుపరి ఐపీఎల్ సీజన్ ఆడాలా..?. వద్దా అనేది నిర్ణయించుకోవడానికి ఇంకా పది నెలల సమయం ఉంది. అప్పుడు ఆడగలనా లేదా అనేది నిర్ణయం శరీరం సహాకరించే విధానాన్ని బట్టి ఉంటుందని వ్యాఖ్యానించారు. ధోనీ తాజా మాటలతో ఈ సీజన్ మొత్తం ఆడతాడని ఫుల్ క్లారిటీ వచ్చేసింది అభిమానులకు.
