చిరు డ్యూయల్ రోల్ -హారీష్ శంకర్ డైరెక్షన్

 చిరు డ్యూయల్ రోల్ -హారీష్ శంకర్ డైరెక్షన్

Chiranjeevi’s new movie for Ugadi..!

3 total views , 1 views today

మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు, అందరివాడు, ఖైదీ నం150 లాంటి చిత్రాలు ఎంత ఘనవిజయం సాధించాయో మనకందరికి తెల్సిందే. డ్యూయల్ రోల్ లో మెగాస్టార్ చిరంజీవి నటన అభినయం అందర్ని మంత్రముగ్ధులు చేసింది. మాస్ క్లాస్ పాత్ర ఏదైన సీన్ ఏదైన సరే నటించి అందర్ని మెప్పించారు మెగాస్టార్.

అలాంటి మెగాస్టార్ మరోకసారి డ్యూయల్ రోల్ లో మనముందుకు వస్తే ఆ కిక్కే వేరు అనుకుంటున్నారా..?. అయితే అది మూవీ కాదు ఓ ప్రకటనకు సంబంధించింది. ప్రముఖ దర్శకుడు హారీష్ శంకర్ దర్శకత్వంలో కంట్రీ డిలైట్ అనే పాల ఉత్పత్తికి సంబంధించిన ఓ కంపెనీ యాడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

పాల ఉత్పత్తికి సంబంధించిన ఈ యాడ్ లో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఈ వీడియోలో అందరివాడులో చిరు కన్పించిన ఆత్మారావు ,చిరు ఇద్దరూ ప్రత్యేక్షమవుతారు. అప్పట్లో అత్మారావు పాత్ర ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెల్సిందే. ఈ యాడ్ లో కూడా అదే మానీయా కన్పించింది. మీరు ఓ లుక్ వేయండి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400