ఉగాదికి చిరంజీవి కొత్త మూవీ..!

Chiranjeevi’s new movie for Ugadi..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల 30న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. జూన్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలయ్యే అవకాశముంది. ఇది చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా.
ఇటు యాక్షన్ తో పాటు కుటుంబ అంశాల మేళవింపుగా అందర్నీ అలరించే కథతో రూపొంద నుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరుకు జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించే అవకాశముంది.. ఓ పాత్ర కోసం అదితీరావు హైదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసి రోలియో సంగీతమందిస్తున్నారు.
