నాగబాబుకు చిరంజీవి అభినందనలు

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు ఈరోజు బుధవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు..
అనంతరం నాగబాబు తన సతీమణితో కల్సి సీఎం చంద్రబాబును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా ఎక్స్ వేదిగా నాగబాబు సోదరుడు..మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అభినందనలు తెలిపారు.
ట్విట్టర్ లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నా తమ్ముడుకి అభినందనలు అని పోస్టు చేశారు.దీనికి బదులుగా థ్యాంక్స్ అన్నయ్య..మీరు తోడ్పాటు.ప్రేమకు కృతజ్ఞతలు..మీరు ఇచ్చిన పెన్ నాకు ప్రత్యేకం.. ప్రమాణ స్వీకారంలో ఆ పెన్ ఉండటం నా అదృష్టం అని ట్వీట్ చేశారు..