సంక్రాంతి సెలవుల్లో మార్పులు
వచ్చేడాది జనవరిలో ఉన్న సంక్రాంతి పండుగక్కి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి.ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఉన్న స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు.
గతంలో ప్రకటించిన ఎకాడమిక్ ఇయర్ ప్రకారం జనవరి 10నుండి 19 తేదీల్లో పొంగల్ హాలీడేస్ ఉండేవి. కానీ తాజా మార్పులతో పదకొండు పదిహేను తేదీల మధ్య లేదాపన్నెండో తారీఖు నుండి పదహారు తారీఖుల మధ్యలో సెలవులుండనున్నట్లు తెలుస్తుంది.
దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. వరదల వల్ల భారీ వర్షాల వల్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించిన కారణంగా పనిదినాలు తగ్గినందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.